Andhra Pradesh: జీకే వీధి అటవీప్రాంతంలో మళ్లీ కాల్పుల మోత.. ఇద్దరు మావోయిస్టుల మృతి

  • విశాఖ జిల్లాలో నిన్న ముగ్గురు మావోయిస్టుల మృతి
  • గాయపడిన వారి కోసం గాలిస్తుండగానే మళ్లీ కాల్పులు
  • ఘటన స్థలం నుంచి 3 ఆయుధాలు స్వాధీనం
విశాఖపట్నం జిల్లా వరుసగా రెండో రోజు కూడా కాల్పుల మోతతో దద్దరిల్లింది. నిన్న జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతులయ్యారు. గాయపడిన వారి కోసం నేడు కూంబింగ్ నిర్వహిస్తుండగా, జీకే వీధి అటవీప్రాంతంలో పోలీసులను చూసి మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ దాడిని పోలీసు బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటన స్థలం నుంచి 3 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Andhra Pradesh
Visakhapatnam District

More Telugu News