Ameerpet: అమీర్ పేట ‘మెట్రో’ ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్

  • ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ జరిపించాలి
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు
  • ప్రయాణికుల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి
అమీర్ పేట ‘మెట్రో’ స్టేషన్ వద్ద ప్రయాణికురాలి మృతి ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ జరిపించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని మెట్రో స్టేషన్ల నిర్మాణాలు, వసతులను పరిశీలించాలని అన్నారు. ప్రయాణికుల భద్రతకు మెట్రో స్టేషన్లలో పటిష్టమైన ఏర్పాట్లు ఉండాలని, అన్ని సమయాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనుకోని ప్రమాదమే అయినప్పటికీ, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని అన్నారు. నాణ్యత, భద్రతా అంశాల్లో హైదరాబాద్ సాధించిన ఖ్యాతిని ‘మెట్రో’ కొనసాగించాలని సూచించారు. మౌనిక మృతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
Ameerpet
Metro station
Minister
Ktr

More Telugu News