Tirumala: తిరుమల పద్మావతి నగర్ గెస్ట్ హౌస్ వద్ద చిరుతపులి సంచారం

  • చిరుతను గుర్తించిన గెస్ట్ హౌస్ సిబ్బంది
  • అటవీశాఖ అధికారులకు సమాచారం
  • గతంలోనూ తిరుమలలో చిరుతల సంచారం
శేషాచల కొండల్లో కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం పరిసరాల్లో వన్యప్రాణులు కూడా సంచరిస్తుంటాయన్నది తెలిసిందే. తాజాగా తిరుమల పద్మావతి నగర్ గెస్ట్ హౌస్ వద్ద ఓ చిరుతపులి సంచరిస్తుండడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. గెస్ట్ హౌస్ సిబ్బంది చిరుతను గుర్తించి హడలిపోయారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తిరుమలలోనే కాదు, కాలినడక మార్గంలో, ఘాట్ రోడ్డులోనూ ఇంతకుముందు చాలాసార్లు చిరుతలు దర్శనమిచ్చాయి. భక్తులపై దాడికి యత్నించిన ఘటనలు కూడా గతంలో చోటుచేసుకున్నాయి.
Tirumala
Leopard

More Telugu News