Vadde Navin: నూజివీడులో నిర్వహించిన 'స్పందన' కార్యక్రమంలో అర్జీ సమర్పించిన సినీ నటుడు వడ్డే నవీన్

  • వ్యవసాయ భూమి పరిహారంపై వినతిపత్రం
  • 1973లో తమ మామిడి తోట తీసుకున్నారని వెల్లడి
  • ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదని వివరణ
ఇటీవల కాలంలో పెద్దగా సినిమాలు చేయని హీరో వడ్డే నవీన్ కృష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన 'స్పందన' కార్యక్రమంలో దర్శనమిచ్చాడు. కృష్ణా జిల్లా కె.మాధవరంలో తమ భూమికి సంబంధించిన వ్యవహారంలో నవీన్ ప్రభుత్వానికి అర్జీ సమర్పించాడు. తమ 18 ఎకరాల భూమికి సంబంధించిన పరిహారం ఇప్పించాలని తన వినతిపత్రంలో కోరాడు. 1973లో భూసంస్కరణల్లో భాగంగా తమ మామిడి తోటను తీసుకున్నారని, అయితే, ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదని వివరించాడు. దీనికి సంబంధించిన అన్ని పత్రాలను అధికారులకు చూపించాడు. అంతకుముందు, వడ్డే నవీన్ తనవంతు వచ్చేవరకు సామాన్య ప్రజల్లో ఒకడిగా క్యూ లైన్ లో నిలుచున్నాడు.

Vadde Navin
Andhra Pradesh

More Telugu News