KCR: కేసీఆర్ అవమానపరిచారని కంటతడి పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

  • రెండు సార్లు గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు
  • నాలుగు సార్లు గెలిచిన నాకు న్యాయం జరగలేదు
  • సరైన పదవి ఇవ్వకుండా అవమానపరిచారు
పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత లేదని కొందరు, తమకు పదవి ఇవ్వలేదని మరికొందరు, గులాబీ జెండాకు తామే యజమానులం అంటూ ఇంకొందరు... ఇలా టీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. తాజాగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కూడా తన ఆవేదనను కార్యకర్తల వద్ద చెప్పుకున్నారు.

తనకు ప్రాధాన్యత లేని పదవిని ఇచ్చారని చెప్పారు. రెండు సార్లు గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని, నాలుగు సార్లు గెలిచిన తనకు సరైన పదవి ఇవ్వకుండా అవమానపరిచారని కంటతడి పెట్టారు. మరోవైపు, మంత్రివర్గ విస్తరణ చేపట్టినప్పటి నుంచి విద్యాసాగర్ రావు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యుడిగా ఇటీవల ఆయనను కేసీఆర్ నియమించారు. దీంతో, ఆయన అభిమానులు కూడా షాక్ కు గురయ్యారు. మంత్రి పదవి ఇవ్వకుండా, చిన్నపాటి పదవి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KCR
TRS
Korutla MLA
Vidya Sagar Rao

More Telugu News