Chandrababu: కరకట్టపై నిర్మాణాల కూల్చివేత షురూ.. చంద్రబాబు ఇంటితో పాటు అన్నింటినీ కూల్చివేస్తామన్న బొత్స

  • అక్రమ కట్టడంలో ఉంటూ ప్రజలకు చంద్రబాబు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు?
  • ల్యాండ్ పూలింగ్ కరకట్ట వరకు వచ్చి ఎందుకు ఆగింది?
  • నిర్మాణాలు సక్రమమైతే కోర్టుకు వెళ్లవచ్చు
అమరావతి ప్రాంతంలోని కరకట్టపై నిర్మించిన కట్టడాల కూల్చివేత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, కేవలం చంద్రబాబు ఇల్లే కాకుండా, కరకట్టపై ఉన్న నిర్మాణాలన్నింటినీ కూల్చి వేస్తామని చెప్పారు. అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ ప్రజలకు చంద్రబాబు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని ప్రాతంలో ల్యాండ్ పూలింగ్ కరకట్ట వరకు వచ్చి ఎందుకు ఆగిందని అడిగారు. కరకట్టపై నిర్మాణాలు సక్రమమైతే కోర్టుకు వెళ్లవచ్చని చెప్పారు.
Chandrababu
Botsa Satyanarayana
Telugudesam
YSRCP

More Telugu News