Trujet: ప్రయాణికులను వణికించిన హైదరాబాద్ - విజయవాడ ట్రూ జెట్ విమానం!

  • ఈ ఉదయం బయలుదేరిన విమానం
  • ఏసీ పనిచేయక తీవ్ర ఇబ్బంది
  • తిరిగి నిమిషాల్లో అత్యవసర ల్యాండింగ్
ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన ట్రూజెట్‌ విమానంలో  ఏర్పడిన సాంకేతిక లోపం ప్రయణికులను వణికించింది. టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానంలో కుదుపులతో పాటు, శ్వాస అందక పాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

విమానంలో ఏసీ పనిచేయడం లేదని గమనించిన పైలట్లు, వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం ఇచ్చి, విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు అనుమతి కోరారు. ఆపై అత్యవసరంగా శంషాబాద్ లో ల్యాండ్‌ చేశారు. ఆపై ప్రయాణికులను కిందకు దించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఏవియేషన్ వర్గాలు వెల్లడించాయి. మరో విమానంలో ప్రయాణికులను గమ్య స్థానానికి చేరుస్తామని ట్రూ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. 
Trujet
Flight
Hyderabad
Vijayawada

More Telugu News