Satyender Jain: ఢిల్లీ రాష్ట్ర మంత్రి ఇంటికే కన్నం వేసిన చోరాగ్రేసరులు!

  • సత్యేందర్ జైన్ ఇంట్లో దొంగతనం
  • పలు విలువైన వస్తువుల దోపిడీ
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
దేశ రాజధానిలో దొంగలు ఎంతగా రెచ్చిపోతున్నారనడానికి ఇది మరో తాజా ఉదాహరణ. ఇటీవలే ఓ పోలీసు అధికారి ఇంట్లో దొంగతనం జరుగగా, ఇప్పుడు చోరాగ్రేసరులు ఏకంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఇంటిని టార్గెట్ చేశారు. ఇక్కడి సరస్వతీ విహార్ ప్రాంతంలో సత్యేందర్ జైన్ నివాసం ఉంటుండగా, ఆయన ఇంటి తలుపులు పగలగొట్టిన దొంగలు పలు విలువైన వస్తువులను తస్కరించారు.

దీనిపై సత్యేందర్ జైన్ భార్య పూనం జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా, మంత్రి ఇల్లు గత ఆరు నెలలుగా తాళం వేసి ఉందని తెలుస్తోంది. జరిగిన ఘటనపై సత్యేందర్ జైన్ ట్వీట్ చేస్తూ పోలీసులపై మండిపడ్డారు. ఢిల్లీ పోలీసులంటే సంఘ విద్రోహ శక్తులకు, దొంగలకు భయం లేకుండా పోయిందని అన్నారు.
Satyender Jain
New Delhi
Theft

More Telugu News