Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
  *  మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలో గోపీచంద్ సరసన కథానాయికగా నటించనుంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించే చిత్రం కోసం తమన్నాను నాయికగా తీసుకున్నట్టు తాజా సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.
*  చిరంజీవి నటించిన 'సైరా' చిత్రంలో ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సంగతి విదితమే. అయితే, ఇందులో నటించినందుకు గాను అమితాబ్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదట. చిత్ర నిర్మాత రాంచరణ్ ఈ విషయాన్ని చెబుతూ, 'చిరంజీవి గారితో వున్న అనుబంధం కారణంగా అమితాబ్ గారు పారితోషికం తీసుకోకుండా చేశారు' అన్నారు.
*  కాజల్ అగర్వాల్ నటించిన తమిళ హిట్ చిత్రం 'కోమలి'ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. అర్జున్ కపూర్ హీరోగా నిర్మించడానికి ఈ చిత్రం రీమేక్ హక్కులను బోనీకపూర్ తీసుకున్నట్టు సమాచారం. అయితే, హిందీలో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తుందా? అన్న విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.  
Go Back to Shorts
Thamanna
Gopichand
Amitabh Bachchan
Chiranjeevi
Kajal Agarwal

More Telugu News