Syeraa: 41 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే టెన్షన్... దానికి కారణం సైరా: చిరంజీవి

షార్ట్స్‌లో చూడండి
సైరా ప్రీరిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ భావోద్వేగాలకు లోనయ్యారు. సెప్టెంబరు 22 అనే తేదీ తన జీవితంలో మర్చిపోలేని తేదీ అని చెప్పారు. 1978 సెప్టెంబరు 22న తన మొట్టమొదటి చిత్రం ప్రాణంఖరీదు రిలీజైందని తెలిపారు. తన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ సినిమాలో తనను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని ఎంతో ఉద్విగ్నతకు గురయ్యానని, మళ్లీ అదే టెన్షన్ 41 ఏళ్ల తర్వాత అనుభవిస్తున్నానని వివరించారు. తన ఉద్వేగానికి కారణం సైరా చిత్రమేనని చెప్పారు.

తాను ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కథ కోసం అన్వేషిస్తున్న సమయంలో పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ చెప్పారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆ కథ విన్నప్పుడు అద్భుతం అనిపించిందని, ఓ యోధుడి కథ చరిత్రలో తెరమరుగైపోయిందన్న ఫీలింగ్ కలిగిందని వివరించారు.
Go Back to Shorts
Syeraa
Chiranjeevi
Ramcharan

More Telugu News