Pawan Kalyan: భారతదేశం గొప్పదనం చాటే సినిమా ఇది: పవన్ కల్యాణ్

  • సైరా ప్రీరిలీజ్ వేడుకకు హాజరైన పవన్ కల్యాణ్
  • సుదీర్ఘ ప్రసంగం చేసిన జనసేనాని
  • తాను చేయలేనిది రామ్ చరణ్ చేశాడంటూ కితాబు
సైరా ప్రీరిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఈ కార్యక్రమానికి వేదికగా నిలవగా, గెస్ట్ గా హాజరైన పవన్ మాట్లాడుతూ, సైరా చిత్రం భారతదేశం గొప్పదనాన్ని చాటుతుందని అన్నారు. అన్ని దేశాలు భారత్ పై దండెత్తినా, భారత్ మాత్రం ప్రపంచంలోని ఏ దేశంపైనా దండయాత్ర చేయలేదని వివరించారు. భారతదేశం అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వ్యక్తుల సమూహం అని అభివర్ణించారు.

తన అన్నయ్య చిరంజీవి గొప్ప చిత్రాల్లో నటించాలని చిన్నప్పటి నుంచి కోరుకునేవాడ్నని, తాను ఇలాంటి సినిమా చేయలేకపోయినా, రామ్ చరణ్ మాత్రం ఇలాంటి చిత్రాన్ని ఎలాంటి స్వార్థం లేకుండా నిర్మించాడని, రామ్ చరణ్ నిజంగా అభినందనీయుడని పేర్కొన్నారు. ఉయ్యాలవాడ గురించి పుస్తకాల్లో చదివితే కొందరికే అర్థమవుతుందని, కానీ ఓ సినిమా ద్వారా ఆయన జీవితం ఎంతోమందికి చేరుతుందని అన్నారు.
Pawan Kalyan
Syeraa
Hyderabad

More Telugu News