Syeraa: సైరా ప్రీరిలీజ్ వేడుక: ఎల్బీ స్టేడియంలో ఇసుకేస్తే రాలనంతగా జనం

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ లో దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఇవాళ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ ముందస్తు వేడుకకు వేదికగా నిలుస్తున్న ఎల్బీ స్టేడియం మెగా అభిమానులతో పోటెత్తింది. ఫ్యాన్స్ ఇసుకేస్తే రాలనంతగా తరలిరావడంతో అందరికీ ప్రవేశం కల్పించడం నిర్వాహకులకు ప్రయాసగా మారింది. దాంతో చాలామంది పాసులు ఉన్నా కార్యక్రమం వీక్షించలేని పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం.
Go Back to Shorts
Syeraa
Chiranjeevi
Ramcharan
Tollywood

More Telugu News