Telangana: సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షల మెరిట్ జాబితాను, కటాఫ్ మార్కులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామక పరీక్షలో ఉత్తీర్ణులైన తొంభై వేల మంది అభ్యర్థులు మెరిట్ జాబితా, కటాప్ మార్కుల కోసం వేచి చేస్తున్నారని అన్నారు.

పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి గత ఏడాది మే లో నోటిఫికేషన్ విడుదల చేసినా ఇప్పటి వరకూ ఆ ప్రక్రియ పూర్తి చేయలేదని విమర్శించారు. ఈ పరీక్షకు హాజరైన నిరుద్యోగ యువత ప్రస్తుతం సొంత ఊళ్లకు వెళ్లలేక హైదరాబాద్ లోనే ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. తక్షణమే ఫలితాల విడుదలకు ఆదేశించాలని కోరుతూ కేసీఆర్ కు రాసిన లేఖలో రేవంత్ రెడ్డి కోరారు.
Go Back to Shorts
Telangana
cm
kcr
Revanth Reddy
congress

More Telugu News