Visakhapatnam District: మరికొందరు మావోయిస్టులు గాయపడి ఉండొచ్చు... వారికోసం గాలిస్తున్నాం: విశాఖ ఎస్పీ బాబూజీ

  • ఏవోబీలో ఎదురుకాల్పులు
  • ముగ్గురు మావోయిస్టులు మృతి
  • స్పందించిన విశాఖ ఎస్పీ
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. దీనిపై విశాఖ జిల్లా ఎస్పీ బాబూజీ మాట్లాడారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. కాల్పుల్లో మరికొందరు మావోయిస్టులు గాయపడి ఉండొచ్చని, వారికోసం గాలిస్తున్నామని తెలిపారు. ఘటనస్థలంలో 4 తుపాకులు, ఓ ల్యాండ్ మైన్, కిట్ బ్యాగ్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందని, స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ దళాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయని వివరించారు.
Visakhapatnam District
Police
Andhra Pradesh
Odisha

More Telugu News