YSRCP: జగన్ గారూ! మరి, మీరు రాజీనామా చేస్తున్నారా? లేదా?: నారా లోకేశ్

  • అప్పట్లో జరగని పేపర్ లీకేజీపై నానా రభస చేశారు
  • మేము కొత్తగా ఏమి అడగడం లేదు
  • అప్పట్లో మీరు అడిగిన డిమాండ్స్ నే అడుగుతున్నాం
ఏపీలో గ్రామ సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై టీడీపీ నేత నారాలోకేశ్ మరోమారు స్పందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ‘అప్పట్లో జరగని పేపర్ లీకేజీపై నానా రభస చేశారు గుర్తుందా? జరిగిన విచారణలో కూడా అదే తేలింది అప్పట్లో. కానీ మీరేం అన్నారో, మీ అబద్ధపు పత్రిక ఎలా విషం చిమ్మిందో ఒకసారి మళ్ళీచూసుకోండి’ అని అన్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబును రాజీనామా చెయ్యాలి, సీబీఐతో విచారణ చేయించాలని జగన్ డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

‘గ్రామ సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాలను మీ మంత్రులే లీక్ చేశారు. మీ అనుచరుల కుటుంబసభ్యులకు ర్యాంకులు వచ్చాయి అన్నది వాస్తవం. 5 లక్షలకు ఒక్కో ఉద్యోగం అమ్ముకోవడం వాస్తవం. పేపర్ లీక్ స్కామ్ బయటకు రాకుండా మీరు రహస్య మంతనాలు జరుపుతున్నారు’ అని లోకేశ్ ఆరోపించారు. ‘మరి మీరు రాజీనామా చేస్తున్నారా? లేదా? మేము కొత్తగా ఏమి అడగడం లేదు, అప్పట్లో మీరు అడిగిన డిమాండ్స్ మాత్రమే అడుగుతున్నాం’ అని తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
YSRCP
cm
Jagan
Telugudesam
Nara Lokesh

More Telugu News