Sivaprasad: నీతో గడిపిన బాల్య స్మృతులు మరువలేను మిత్రమా!: భావోద్వేగాలతో చంద్రబాబు పోస్టు

  • శివప్రసాద్ మృతిపై చంద్రబాబు స్పందన
  • కదిలిపోయిన చంద్రబాబు!
  • చిన్ననాటి ఫొటోతో ట్వీట్
టీడీపీ అధినేత చంద్రబాబు వృత్తిపరంగా ఎంతో ప్రొఫెషనల్ గా కనిపిస్తారు. పని విషయంలో పక్కా నిబద్ధతో వ్యవహరించే ఆయన, చాలావరకు గంభీరంగా కనిపిస్తారు. కానీ మాజీ ఎంపీ శివప్రసాద్ మృతితో చంద్రబాబులోని మరో కోణం వెల్లడైంది. ఎంతో కఠినంగా ఉండే ఆయన సైతం కదిలిపోయారు. అందుకు బలమైన కారణమే ఉంది. శివప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబుకు బాల్యమిత్రుడు. ఇద్దరూ కలిసి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. శివప్రసాద్ అంత్యక్రియల సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ లో చేసిన పోస్టు ఆయన ప్రస్తుత మానసిక స్థితికి అద్దం పడుతోంది.

"నీతో గడిపిన బాల్య స్మృతులు మరువలేను మిత్రమా! 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు కలిసే చదువుకున్నాం. ప్రజాసేవలోనూ కలిసే ఉన్నాం. దూరతీరాలకు సాగిపోయిన బాల్య నేస్తమా, అందుకో నా ఈ కడసారి వీడ్కోలు" అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు. అంతేకాకుండా, తామిద్దరూ కలిసి ఉన్న  పాఠశాల రోజుల నాటి ఫొటోను కూడా పోస్టు చేశారు.
Sivaprasad
Chandrababu
Telugudesam

More Telugu News