Bigg Boss: 'బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు': నాగార్జున

  • యువతలో అవగాహన పెంచే కార్యక్రమాలు
  • పోస్టర్ ను ఆవిష్కరించిన నాగ్
  • మెట్రో రైల్వే స్టేషన్లలో కొత్త ప్రచారం
ప్రమాదాలపై యూత్ లో అవగాహన పెంచేందుకు బిగ్ బాస్ ను వేదిక చేసుకున్నారు నాగ్. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో స్టార్‌– మా నెట్‌ వర్క్‌ బిజినెస్‌ హెడ్‌ అలోక్‌ జైన్ తో కలిసి  "బిగ్‌ బాస్‌ మిమ్మల్ని చూస్తున్నాడు" అనే పోస్టర్ ను నాగార్జున ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో అవగాహన పెంచేలా పలు స్లోగన్స్ ఉన్నాయి.

మెట్రో రైల్ ఎక్కే సమయంలో ఎల్లో లైన్ క్రాస్ చేయవద్దని, తోటి ప్రయాణికులను నెట్టవద్దని, డోర్లపై ఆనుకుని నిలబడవద్దని, రైలు ఎక్కేందుకు తొందర పడవద్దని ఉంది. దీంతోపాటు క్యూలైన్లను పాటించాలని, బ్యాక్ ప్యాక్ ను చేతిలో పట్టుకోవాలని కూడా సూచలను ఉన్నాయి. అతి త్వరలో హైదరాబాద్ లోని మెట్రో స్టేషన్ లలో "బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు" ప్రచారం ప్రారంభమవుతుందని అన్నారు. ప్రాణాలు చాలా విలువైనవని, వాటిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.
Bigg Boss
Nagarjuna

More Telugu News