Sivaprasad: తిరుపతి చేరుకున్న శివప్రసాద్ భౌతికకాయం...భారీగా తరలివస్తున్న టీడీపీ శ్రేణులు

  • అనారోగ్యంతో కన్నుమూసిన శివప్రసాద్
  • ఎన్జీవో కాలనీ నివాసానికి చేరుకున్న శివప్రసాద్ భౌతికకాయం
  • ఎల్లుండి అంత్యక్రియలు
అనారోగ్యంతో మరణించిన టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ భౌతికకాయం చెన్నై నుంచి తిరుపతి తరలించారు. భారీ కాన్వాయ్ వెంట రాగా శివప్రసాద్ భౌతికకాయాన్ని ఈ సాయంత్రం చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి తీసుకువచ్చారు. ఆయన మరణవార్త తెలియగానే టీడీపీ శ్రేణులు తిరుపతి ఎన్జీవో కాలనీలోని ఆయన నివాసం వద్దకు భారీగా తరలి వచ్చాయి. శివప్రసాద్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం అగరాలలో సోమవారం నిర్వహిస్తారు.
Sivaprasad
Telugudesam
Tirupati

More Telugu News