Sivaprasad: శివప్రసాద్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్ అనారోగ్యంతో ఈ రోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, శివప్రసాద్ కుటుంబ సభ్యులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. శివప్రసాద్ అర్ధాంగి విజయలక్ష్మితో ఫోన్ లో మాట్లాడిన ఆయన ఓదార్పు వచనాలు పలికారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. సినీ, రాజకీయ రంగాల్లో శివప్రసాద్ రాణించారని కొనియాడారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Sivaprasad
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News