Andhra Pradesh: నా చిరకాల మిత్రుడు శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు!: టీడీపీ అధినేత చంద్రబాబు

  • నేడు చెన్నైలో శివప్రసాద్ కన్నుమూత
  • హోదా కోసం రాజీలేని పోరాటం చేశారన్న చంద్రబాబు
  • ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన
తెలుగుదేశం నేత, లోక్ సభ మాజీ సభ్యుడు శివప్రసాద్ ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో చెన్నైలోని అపోలోలో చికిత్స పొందుతున్న శివప్రసాద్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో శివప్రసాద్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నా చిరకాల మిత్రుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు, టీడీపీ నేత, డా.ఎన్ శివప్రసాద్‌ గారి మరణం విచారకరం.

ప్రత్యేకహోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం ఆయన రాజీలేని పోరాటం చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటు’ అని వ్యాఖ్యానించారు. శివప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం టీడీపీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Chandrababu
Twitter
Condolenses

More Telugu News