anilkumar yadav: రూ.58 కోట్ల ఆదా ఆరంభమే...రివర్స్‌ టెండరింగ్‌ పక్కాగా కొనసాగుతుంది : మంత్రి అనిల్‌కుమార్‌

  • పారదర్శక ప్రక్రియతోనే ముందుకు వెళ్తాం
  • టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలి
  • మీరు ఆర్‌ఆండ్‌ఆర్‌నే పట్టించుకోలేదని గుర్తుంచుకోండి
పోలవరం రివర్స్‌ టెండర్ల ద్వారా తొలి ప్రయత్నంలో ప్రభుత్వానికి మిగిలిన రూ.58 కోట్లు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరింత మొత్తం ప్రభుత్వ ఖజానాకు మిగులుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. సీఎం జగన్‌ తనకు అనుకూలమైన వారికి తొలి టెండర్‌ పనులు కట్టబెట్టారన్న విపక్ష టీడీపీ ఆరోపణల నేపథ్యంలో ఈరోజు మంత్రి విలేకరులతో మాట్లాడారు. రివర్స్‌ టెండరింగ్‌ పూర్తి పారదర్శకతతో సాగుతోందని, టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు.

‘మీ ప్రభుత్వ హయాంలో స్పిల్‌వే పనులు మాత్రమే పూర్తి చేశారు. పేద ప్రజల ఆర్‌అండ్‌ఆర్‌ను కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మంచి ఆలోచనతో జగన్‌ ముందుకు వెళ్తుంటే మీకు కంటగింపుగా ఉండి విమర్శలు చేయడం తగదు’ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ పారదర్శక విధానంతో ఇకపైనా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
anilkumar yadav
polvaram
reverce tendaring
Telugudesam

More Telugu News