Andhra Pradesh: కోడెల అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ చంద్రబాబు ఈవెంట్ స్కిల్స్ ను అద్భుతంగా ప్రదర్శించారు!: విజయసాయిరెడ్డి

  • ఎల్లో మీడియా సౌజన్యంతో ఇదంతా చేశారు
  • వర్ల రామయ్యను చంద్రబాబు ఉసిగొల్పారు
  • కోడెలను మానసిక క్షోభకు గురిచేశారు
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తన విమర్శలదాడిని కొనసాగిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ అంత్యక్రియల సందర్భంగా చంద్రబాబు తన ఈవెంట్ మేనేజ్ మెంట్ స్కిల్స్ ను అద్భుతంగా ప్రదర్శించారని సాయిరెడ్డి విమర్శించారు. ఇందుకు ఎల్లో మీడియా సహకారం అందజేసిందని చెప్పారు.

కోడెలపై అంతకుముందు వర్ల రామయ్య వంటి నేతలను చంద్రబాబు ఉసిగొల్పారనీ, అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు పల్నాటి పులి అంటూనే కోడెలను తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశారని దుయ్యబట్టారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి.. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలను ట్యాగ్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Twitter

More Telugu News