Jammu And Kashmir: కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే: అజ్మీర్ షరీఫ్ దర్గా మత గురువు

  • ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అవసరం లేదు
  • ఆర్టికల్ 370 రద్దుపై పాక్ విష ప్రచారం
  • కశ్మీర్ అభివృద్ధికి తోడ్పడండి
జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చెందిన ముస్లిం మత గురువు హాజీ సయ్యద్ సల్మాన్ చిష్టీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు, సందేహాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. కశ్మీర్ పౌరులందరూ ఇక తమ పిల్లల భవిష్యత్ కోసం, కశ్మీర్ అభివృద్ధి కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని 18 కోట్ల మంది ముస్లింలు శాంతియుతంగా జీవిస్తున్నారని, దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్న చిష్టీ.. కశ్మీర్ ప్రజలకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
Jammu And Kashmir
ajmer sharif dargah
syed salman chishty

More Telugu News