Srisailam Dam: శ్రీశైలానికి మరింత పెరిగిన వరద ఉద్ధృతి

  • ఎగువన కురుస్తున్న వర్షాలతో పోటెత్తుతున్న వరద
  • ప్రస్తుత నీటి మట్టం 884.80 అడుగులు
  • ఔట్ ఫ్లో 1,60,144 క్యూసెక్కులు
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యాంకు వరద పోటెత్తుతోంది. తుంగభద్ర, జూరాల, హంద్రీల నుంచి శ్రీశైలం డ్యాంకు 1,60,087 క్యూసెక్కుల వరద వస్తోంది. డ్యాం నీటి మట్టం ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం డ్యాంలో 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంంలో వివిధ మార్గాల ద్వారా 1,60,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుకు 5 వేలు, కల్వకుర్తికి 2,400, హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  

Srisailam Dam
Water Level

More Telugu News