Pakistan: పాక్ పర్యటనకు శ్రీలంక క్రికెటర్ల వెనుకంజపై అఫ్రిది వితండవాదం!

  • గతంలో ఉగ్రదాడి ఎదుర్కొన్న లంక క్రికెట్ జట్టు
  • మరోసారి పాక్ వెళ్లేందుకు లంక సీనియర్ల విముఖత
  • ఐపీఎల్ ఒత్తిడి కారణంగానే లంకేయులు వెనక్కి తగ్గారన్న అఫ్రిది

పాకిస్థాన్ లో పర్యటించడం అంటే కోరి ప్రమాదాన్ని ఆహ్వానించడమేనని శ్రీలంక క్రికెట్ జట్టుకు ఇప్పటికే ఓసారి అనుభవమైంది. అందుకే మరోసారి ఆ దేశంలో పర్యటించేందుకు తాము వెళ్లబోమని మలింగ, కరుణరత్నే, మాథ్యూస్ వంటి క్రికెటర్లు సైతం వెనుకంజ వేశారు. పాక్ టూర్ లో తాము పాల్గొనడం లేదని తమ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేశారు.

 దీనిపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది స్పందించాడు. పాకిస్థాన్ వెళితే ఐపీఎల్ కాంట్రాక్టులు రద్దు చేస్తామని ఫ్రాంచైజీలు బెదిరించిన కారణంగానే లంక ఆటగాళ్లు తమ దేశం రావడానికి ఇష్టపడడంలేదని అన్నాడు. లంక క్రికెటర్లను పాక్ వెళ్లనివ్వకుండా చేయడంలో ఫ్రాంచైజీల ఒత్తిడి పనిచేసిందని ఆరోపించాడు. ఈ విషయం కొందరు లంక ఆటగాళ్లే తనతో చెప్పారని, పాకిస్థాన్ లో పీఎస్ఎల్ (పాకిస్థాన్ క్రికెట్ లీగ్) లో ఆడాలని ఉందని కూడా వాళ్లు వెల్లడించారని అఫ్రిది తెలిపాడు.

More Telugu News