Telugudesam: మాజీ ఎంపీ శివప్రసాద్‌ ను పరామర్శించిన చంద్రబాబునాయుడు

  • కిడ్నీ సంబంధిత వ్యాధితో శివప్రసాద్ కు తీవ్ర అస్వస్థత
  • చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • శివప్రసాద్ ను పరామర్శించా.. త్వరగా కోలుకోవాలి: బాబు 
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత ఎన్.శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. శివప్రసాద్ కుటుంబసభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు తన ట్వీట్ లో తెలిపారు. శివప్రసాద్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.
Telugudesam
N.Sivaprasad
Chandrababu
chitoor

More Telugu News