Narendra Modi: కార్పొరేట్ పన్ను తగ్గింపు చర్యలు చారిత్రాత్మకం: మోదీ

  • ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధాని
  • ఆరోగ్యకరమైన పోటీతత్వం నెలకొంటుందన్న మోదీ
  • ట్విట్టర్ లో స్పందన
దేశీయ కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేట్ పన్నుల రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న చర్యలను స్వాగతించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు. దీని ఫలితంగా 'మేకిన్ ఇండియా' కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయివేటు పెట్టుబడులు రాబట్టేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. దేశీయ ప్రయివేటు రంగంలో కూడా ఆరోగ్యకరమైన పోటీతత్వం నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. మరిన్ని ఉద్యోగాల కల్పనకు ఇది ఊతమిస్తుందని ట్విట్టర్ లో వివరించారు.
Narendra Modi
Nirmala Sitaraman

More Telugu News