Virat Kohli: ఆ ఇద్దరి వల్లే కోహ్లీ కెప్టెన్ గా రాణించగలుతున్నాడు: గంభీర్

  • ధోనీ, రోహిత్ వల్లే కోహ్లీ కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడని వెల్లడి
  • ఐపీఎల్ క్రికెట్లో కోహ్లీ తేలిపోయాడన్న గంభీర్
  • కోహ్లీపై విమర్శనాత్మక వ్యాఖ్యలు
ఐపీఎల్ లో కెప్టెన్ గా రాణించలేని విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో మంచి కెప్టెన్ గా విజయాలు అందుకోవడానికి కారణం మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలేనని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. వాళ్లిద్దరు లేకపోతే కోహ్లీ కెప్టెన్సీ ఏపాటిదో తేలిపోతుందని విమర్శించాడు. అందుకు ఐపీఎల్ క్రికెట్టే నిదర్శనం అని గంభీర్ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ ను ఉన్నతస్థాయికి చేర్చగా, ధోనీ సూపర్ కింగ్స్ ను తిరుగులేని స్థానంలో నిలిపాడని వివరించాడు. కానీ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఏ విధంగా తయారుచేశాడో ఫలితాలు చూస్తే అర్థమవుతుందని అన్నాడు.
Virat Kohli
Rohit Sharma
Gautam Gambhir

More Telugu News