Chandrababu: మీ పుత్రరత్నం ఏమన్నా వజ్రమా? అంటూ చంద్రబాబును కోడెల ప్రశ్నించడం నిజం కాదా?: ముద్రగడ వ్యాఖ్యలు

  • చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ
  • చంద్రబాబు చిలుక పలుకులు పలుకుతున్నారంటూ విమర్శలు
  • కోడెల అంతిమయాత్రలో చంద్రబాబుదంతా నటన అంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు మాటతీరు మారిపోయిందని, చిలుక పలుకులు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు బాగా నటించారని, ఆయన నటనంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు.

 కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు రెండు వేళ్లు చూపించడం ఏం సంస్కారం అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కోడెలను పిలిపించుకున్న చంద్రబాబు, మీ కుమారుడి వల్ల చెడ్డపేరు వస్తోంది, అతడ్ని అదుపులో పెట్టండి అంటూ హెచ్చరించగా, మీ పుత్రరత్నం ఏమన్నా వజ్రమా? అంటూ కోడెల ఘాటుగా బదులివ్వడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ రాశారు.
Chandrababu
Mudragada Padmanabham
Telugudesam
Kodela

More Telugu News