రేవంత్‌, ఏంటా స్పీడు...నువ్వు చాలా జూనియర్‌ తెలుసా?: వీహెచ్‌ హితవు

రేవంత్‌ రెడ్డి స్పీడు ప్రాంతీయ పార్టీల్లో చెల్లుతుందిగాని, కాంగ్రెస్‌ వంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న జాతీయ పార్టీల్లో చెల్లదని, ఆయన స్పీడ్‌ తగ్గించుకోవాలని తెలంగాణ సీనియర్‌ నాయకుడు వి.హెచ్‌.హనుమంతరావు చురకంటించారు. యురేనియం విషయంలో కొందరికి ఏబీసీడీలు కూడా తెలియవని ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులని ఉద్దేశించి చేసిన విమర్శలపై మండిపడ్డారు.

 ‘నువ్వు చాలా జూనియర్‌. నీ స్థాయికి అంత స్పీడ్‌ పనికి రాదు’ అంటూ హితవు పలికారు. హుజూర్‌నగర్‌ అభ్యర్థి విషయంలో రేవంత్‌ వ్యాఖ్యలు సరికాదన్నారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి మూడు సార్లు గెలిచిన విషయాన్ని మర్చిపోరాదని సూచించారు. రేవంత్‌ వ్యాఖ్యల వల్ల నల్గొండ జిల్లా నేతలంతా ఏకమయ్యారని గుర్తుచేశారు.

VH
Revanth Reddy
hujurnagar
yurenium

More Telugu News