Jammu And Kashmir: కశ్మీర్ లో 273 మంది ఉగ్రవాదులు.. హై అలర్ట్

షార్ట్స్‌లో చూడండి
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. మరోవైపు, జమ్మూకశ్మీర్లో 273 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దాడులకు పాల్పడటం ద్వారా, అలజడులు సృష్టించేందుకు ఈ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు యత్నిస్తున్నారని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కశ్మీర్ లో 96, దక్షిణ కశ్మీర్ లో 158, మధ్య కశ్మీర్ లో 19 మంది ముష్కరులు ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఈ నేపథ్యంలో, భారత భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరుల కోసం వేటను ప్రారంభించాయి.

Go Back to Shorts
Jammu And Kashmir
Terrorists
Intelligence

More Telugu News