Jagan: ఏపీ సీఎం జగన్ పోస్టర్‌కు కర్ణాటక ఆర్టీసీ సిబ్బంది పాలాభిషేకం
ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ కర్ణాటక ఆర్టీసీ ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ తీసుకున్నలాంటి నిర్ణయమే కర్ణాటక ప్రభుత్వం కూడా తీసుకుని కేఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరే కరూర్ డిపోలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. అనంతరం జగన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.