Narendra Modi: రామ మందిరంపై సుప్రీంకోర్టు తీర్పును విశ్వసిద్దాం: మోదీ

  • రామ మందిరంపై కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు
  • సుప్రీంకోర్టును ప్రతి ఒక్కరూ గౌరవించాలి
  • న్యాయ వ్యవస్థ, రాజ్యాంగంపై అందరికీ విశ్వాసం ఉండాలి
అయోధ్య రామ మందిరంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును విశ్వసిద్దామని పిలుపునిచ్చారు. మందిరంపై గత రెండు, మూడు రోజులుగా ఉన్నవీ, లేనివీ మాట్లాడుతున్నారని.... సుప్రీంకోర్టును ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెప్పారు. న్యాయ వ్యవస్థ, రాజ్యాంగంపై అందరికీ విశ్వాసం ఉండాలని అన్నారు. మహారాష్ట్రలోని నాసిక్ లో ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తో కలసి మహా జనాదేశ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ... సుప్రీం తీర్పును విశ్వసిద్దామని అన్నారు. కశ్మీరీలను ప్రేమతో హత్తుకుందామని.. కశ్మీర్ లోయలో స్వర్గాన్ని సృష్టిద్దామని పిలుపునిచ్చారు.
Narendra Modi
Ayodhya Ram Mandir
Supreme Court
BJP

More Telugu News