jagadish reddy: ఆ ఎన్నికల్లో ట్రక్కే మా కొంపముంచింది: తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి

  • హుజూర్‌నగర్‌కు త్వరలో ఉప ఎన్నిక
  • ఈసారి గెలుపు ఖాయమన్న మంత్రి జగదీశ్ రెడ్డి
  • కేసీఆర్ త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తారన్న మంత్రి
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌లో తమ అభ్యర్థి ఓడిపోవడానికి కారణం ట్రక్కు గుర్తేనని, ఈసారి అక్కడ తమ గెలుపు ఖాయమని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌లో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేయబోయే అభ్యర్థిని ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ప్రకటిస్తారని తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో తాము దాడి చేసినట్టు ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్న మంత్రి.. పీసీసీ స్థాయి వ్యక్తి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు.
jagadish reddy
huzurnagar
TRS
byelection

More Telugu News