Indian Air Force: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా ఆర్కేఎస్ భదౌరియా నియామకం

  • ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ గా ఉన్న భదౌరియా
  • కొత్త చీఫ్ గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు
  • ఈ నెల 30న బాధ్యతలు స్వీకరించనున్న భదౌరియా
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా ఆర్కేఎస్ భదౌరియాను నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ గా ఆయన ఉన్నారు. ఈ నెల 30న వాయుసేన కొత్త చీఫ్ గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్  చీఫ్ గా ఉన్న బీఎస్ ధనోవా పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. అయితే, అదే రోజున వైస్ చీఫ్ భదౌరియా పదవీకాలం కూడా ముగియనుంది. కానీ, ఆయన సర్వీసును మూడేళ్లు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుని, కొత్త చీఫ్ గా నియమించింది.
Indian Air Force
New chief
Rks
Bhadauria

More Telugu News