Assembly committees: ఏపీలో మూడు అసెంబ్లీ కమిటీల ఏర్పాటు

  • ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్
  • అంచనాల కమిటీ చైర్మన్ గా రాజన్న దొర
  • ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ గా చిర్ల జగ్గిరెడ్డి
ఏపీలో మూడు అసెంబ్లీ కమిటీలను స్పీకర్ తమ్మినేని సీతారాం నియమించారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఈ మేరకు ఓ బులెటిన్ విడుదల చేశారు. ప్రజా పద్దుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ)  చైర్మన్ గా పయ్యావుల కేశవ్, అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్ కమిటీ) చైర్మన్ గా రాజన్న దొర, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ) చైర్మన్ గా చిర్ల జగ్గిరెడ్డిని నియమించారు. ఆయా కమిటీల్లో చైర్మన్లతో పాటు 12 మంది సభ్యులుగా ఉన్నారు. ఆ పన్నెండు మందిలో 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సభ్యులు. ఈ మూడు కమిటీల్లో ఉభయసభలకు చెందిన సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించారు.
Assembly committees
Payyavula Keshav
Rajanna dora

More Telugu News