Shilpa Chakravarthi: బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీముఖి బయటికొచ్చాక అడుగుతాను: శిల్పా చక్రవర్తి

  • అందరితో పాజిటివ్ గా వున్నాను 
  • నెగెటివ్ విషయాలు ప్రస్తావించలేదు 
  • శ్రీముఖి నాకు పెద్దగా తెలియదన్న శిల్ప   
'బిగ్ బాస్ 3' హౌస్ నుంచి ఇటీవల ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికి వస్తూ నేను అందరికీ బిరుదులు ఇచ్చాను .. కాకపోతే పాజిటివ్ వే లో ఇచ్చాను. నెగెటివ్ విషయాలు చెప్పదలచుకుంటే చాలానే వున్నాయి .. కానీ నాకు ఆ ఉద్దేశం లేదు.

బయటికి వచ్చాక నాకు ఒక వీడియో చూపించారు. అందులో శ్రీముఖి ధోరణే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకటి .. రెండు ఈవెంట్స్ లో నేను - శ్రీముఖి కలిశామేమో. ఆ అమ్మాయిని నేను టీవీలో చూసిందే ఎక్కువ. ఆ అమ్మాయి 'శిల్పగారికి చాలా చరిత్ర వుంది .. నేనంటే శిల్పకి పడదు' అని అనడం విని నేను షాక్ అయ్యాను. తాను అలా చెప్పడం వలన చాలామంది నిజమేనని అనుకునే అవకాశం వుంది. అది నాకు సంబంధించిన ఓటింగుపై ప్రభావం చూపించే ఉంటుంది. అందుకే శ్రీముఖి బయటికి వచ్చిన తరువాత ఈ విషయాన్ని గురించి అడగాలనుకుంటున్నాను" అని అన్నారు.
Shilpa Chakravarthi
Srimukhi

More Telugu News