kaleswaram praoject: కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరం కాంట్రాక్టర్ల జేబులు నింపారు: కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి విమర్శలు

  • అస్మదీయుల కోసమే ప్రభుత్వ పెద్దల పన్నాగం
  • ఇంతా చేస్తే ఎగువకు చుక్కనీరు పంపలేదు
  • టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి రూ.4600 కోట్లా?
అస్మదీయుల కోసం ప్రభుత్వ పెద్దలు ఓ పథకం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కొనసాగించారని, కమీషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్ల జేబులు నింపారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టారన్నట్టు ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారని ధ్వజమెత్తారు. లేదంటే ఓ టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి 4,600 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం విడ్డూరం కాదా? అని ప్రశ్నించారు. పోనీ ఇంత ఖర్చు చేసినా ఎగువకు చుక్క నీరు పంపగలిగారా అంటే అదీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కంపెనీలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరులను నింపాలని విజ్ఞప్తి చేశారు.
kaleswaram praoject
Jeevan Reddy
commissions

More Telugu News