Nayanatara: భారీగా పారితోషికం పెంచేసిన నయనతార?

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ భాషల్లో నయనతారకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక వైపున సీనియర్ స్టార్ హీరోలతోను .. మరో వైపున స్టార్ డమ్ వున్న యువ కథానాయకులతోను .. ఇంకో వైపున వర్ధమాన కథానాయకులతోను సినిమాలు చేయడం .. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా మెప్పించడం నయనతార ప్రత్యేకత.

అలాంటి నయనతార చిరంజీవి సరసన 'సైరా' చేసింది. తమిళంలో రజనీ సరసన 'దర్బార్' .. విజయ్ జోడీగా 'బిజిల్' చేస్తోంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాను కూడా చేస్తోంది. తనకి గల క్రేజ్ ను బట్టి తన పారితోషికాన్ని పెంచుకుంటూ ఆమె 4 కోట్ల వరకూ తీసుకొచ్చింది. సౌత్ లో ఈ స్థాయి పారితోషికం తీసుకునే హీరోయిన్ మరొకరు లేరు. ఈ నేపథ్యంలో నయనతార తన పారితోషికాన్ని మరో 2 కోట్లకి పెంచేసిందని చెప్పుకుంటున్నారు. ఆమెతో సినిమా చేయాలంటే 6 కోట్లు సమర్పించుకోవలసిందేనన్నమాట. ఇప్పుడు ఈ విషయమే కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.
Go Back to Shorts
Nayanatara

More Telugu News