Yuvraj Singh: సరిగ్గా ఇదే రోజున 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన యువరాజ్.. వీడియో చూడండి

  • 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ లో యువీ వీరవిహారం
  • ఇగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో హోరెత్తించిన యువీ
  • స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో సిక్సర్ల మోత
భారత క్రికెట్లో తనదైన ముద్ర వేసిన యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి చరిత్రకెక్కిన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల క్రితం సరిగ్గే ఇదే రోజున యువీ ఈ ఫీట్ సాధించాడు. తొలి టీ20 ప్రపంచకప్ లో భాగంగా 2007 సెప్టెంబర్ 19న దక్షిణాఫ్రికాలోని కింగ్స్ మీడ్ గ్రౌండ్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో యువీ సిక్సర్ల మోత మోగించి, టీమిండియాకు విజయాన్ని అందించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్ లో 6 బంతులకు 6 సిక్సర్లు బాదాడు. యువీ సిక్సర్ల మోతకు స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. మరోవైపు,  యువీ వీరవిహారానికి బ్రాడ్ కన్నీరు పెట్టేశాడు.
Yuvraj Singh
Six Sixes
Team India

More Telugu News