Telangana: మసీద్, దేవాలయాన్ని తరలిస్తామంటే మేం ఒప్పుకోం: ఎంఐఎం ఎమ్మెల్యే మొజాంఖాన్

  • కొత్త సచివాలయం నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు
  • ప్రస్తుత సచివాలయంలో ఉన్న మసీద్, దేవాలయం సంగతేంటి?
  • దీనిపై ప్రభుత్వం హామీ ఇవ్వాలి
కొత్త సచివాలయం నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే, ప్రస్తుత సచివాలయంలో ఉన్న మసీద్, దేవాలయం సంగతేంటని తెలంగాణ రాష్ట్ర ఎంఐఎం ఎమ్మెల్యే మొజాంఖాన్ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న మసీద్, దేవాలయం తరలిస్తామంటే ఒప్పుకోమని అన్నారు. ఆ రెండూ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండాలని కోరారు. దీనిపై ప్రభుత్వం హామీ ఇవ్వాలని, ఈ అంశం కోర్టులో ఉందని చెప్పి దాటవేయొద్దని సూచించారు.
Telangana
Secretariat
mim
mla
mozam khan

More Telugu News