దుమ్మురేపేస్తోన్న 'సైరా' ట్రైలర్
- రేనాటి వీరుడి కథగా 'సైరా'
- భారీ తారాగణం మరో బలం
- అక్టోబర్ 2వ తేదీన సినిమా విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఆంగ్లేయులపై నరసింహారెడ్డి తిరుగుబాటు .. నరసింహారెడ్డి ఆచూకీ కోసం ఆంగ్లేయులు అక్కడి ప్రజలను హింసించడం ఈ ట్రైలర్లో చూపించారు. "స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తోన్న తిరుగుబాటు .. నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్నా .. నా దేశం వదిలి వెళ్లిపోండి .. లేదా .. యుద్ధమే" అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పెంచడానికి టీమ్ చేసిన ప్రయత్నం నెరవేరిందనే చెప్పాలి.