Kodela: కోడెల మరణవార్తను జీర్ణించుకోలేక.. గుండెపోటుతో మృతి చెందిన అభిమాని

  • కోడెల మరణంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్లు అనే అభిమాని
  • నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటుకు గురైన వైనం
  • కొనసాగుతున్న కోడెల అంతిమయాత్ర
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఇక లేరు అనే వార్తను తట్టుకోలేక మద్దినేని వెంకటేశ్వర్లు అనే ఓ అభిమాని గుండెపోటుకు గురై మరణించారు. నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆయన గుంటూరులోని డొంకరోడ్డు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

మరోవైపు, కోడెల అంతిమయాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ సీనియర్లు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొంటున్నారు.  
Kodela
Telugudesam
Suicide

More Telugu News