Varun Tej: తెరపై మీకు గద్దలకొండ గణేశ్ మాత్రమే కనిపిస్తాడు: హీరో వరుణ్ తేజ్

  • నా పాత్రలో విలన్ షేడ్స్ ఉంటాయి
  • రిస్క్ చేయవద్దని అన్నారు 
  • కథపై నమ్మకంతో రంగంలోకి దిగానన్న వరుణ్
వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' చిత్రం రూపొందింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .."ఈ సినిమాలో నేను గద్దలకొండ గణేశ్ గా కనిపిస్తాను. నా పాత్రలో విలన్ షేడ్స్ ఉండటంతో, రిస్క్ చేయవద్దని చాలామంది చెప్పారు.

కానీ నేను కథపై గల నమ్మకంతో రంగంలోకి దిగాను. ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడతాను. ఈ విషయంలో హరీశ్ శంకర్ తన పూర్తి సహాయ సహకారాలను అందించాడు. ఈ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని చేశాను. అందువలన తెరపై మీకు గద్దలకొండ గణేశ్ కనిపిస్తాడేగానీ, వరుణ్ తేజ్ మాత్రం కనిపించడు" అని చెప్పుకొచ్చాడు.
Varun Tej
Pooja Hegde

More Telugu News