Komatireddy: సాధు జంతువులాంటి కాంగ్రెస్ ను చంపి.. పులిలాంటి బీజేపీని బలపరిచారు: కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి

  • తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది
  • బీజేపీలో చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే చేరుతా
  • కాలేజీ రోజుల నుంచే హరీశ్ రావు నాకు మంచి మిత్రుడు
తెలంగాణలో బీజేపీ బలపడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాధుజంతువులాంటి కాంగ్రెస్ ను చంపి... పులిలాంటి బీజేపీని బలపరిచారని విమర్శించారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పారు. సాంకేతికంగా తాను మరో నాలుగేళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేనేనని అన్నారు. బీజేపీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వెళ్తానని తెలిపారు. డిండి ప్రాజెక్టు భూసేకరణ నిధుల కోసం మంత్రి హరీశ్ రావును కలిశానని చెప్పారు. కాలేజీ రోజుల నుంచే హరీశ్ తనకు మంచి మిత్రుడని తెలిపారు.  
Komatireddy
Harish Rao
KCR
TRS
Congress
BJP

More Telugu News