RTGS: రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలేనంటున్న ఆర్టీజీఎస్

  • ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా వర్షాలు
  • రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన
  • రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరిక
బంగాళాఖాతంలో పశ్చిమమధ్య ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా గత రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఏపీలో మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఆర్టీజీఎస్ తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

అదే సమయంలో తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ఆర్టీజీఎస్ తాజా బులెటిన్ లో హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.
RTGS
Rains
Andhra Pradesh

More Telugu News