Kodela: నెల క్రితం కోడెల ఫోన్ చేసి ఎంతో బాధపడ్డారు: బీజేపీ నేత రఘురామ్

  • చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని కోడెల చెప్పారు
  • బీజేపీలో చేరుతానని, అమిత్ షాను కలుస్తానని అన్నారు
  • కోడెల మృతి దురదృష్టకరమన్న రఘురామ్
తెలుగుదేశం పార్టీలో తనకు ఏ మాత్రమూ విలువ ఇవ్వడం లేదని కోడెల తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, నెల రోజుల క్రితం తనకు ఫోన్ చేసి, ఇదే విషయాన్ని చెప్పుకుని బాధపడ్డారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఢిల్లీలో ఆ పార్టీ సమన్వయకర్త పురిఘళ్ల రఘురామ్‌ వ్యాఖ్యానించారు. కోడెల మృతి వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.

ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, చంద్రబాబు నాయుడిపై కోడెల ఆరోపణలు చేశారని, తనను వాడుకుని, ఇప్పుడు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారని రఘురామ్ తెలిపారు. నిజాయతీతో పనిచేసే తనకు ఇప్పుడు విలువ లేకుండా పోయిందని, తనను పూర్తిగా ఒంటరిని చేశారని వాపోయారని పేర్కొన్నారు. తాను బీజేపీలో చేరుతానని, అమిత్‌ షాను కలవాలని ఉందని కూడా కోడెల చెప్పారని, కానీ, అమిత్‌ షాను కలవకుండానే కోడెల మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు.
Kodela
BJP
Talasila
Raghuram

More Telugu News