Chandrababu: ఆస్తుల పంపకంలో మాట సాయం చేస్తే క్రిమినల్ కేసు పెట్టారు: చంద్రబాబు

  • ఏకపక్షంగా అణగదొక్కాలంటే మీవల్ల కాదన్న చంద్రబాబు
  • కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలుసంటూ వ్యాఖ్యలు
  • కోడెల మృతి నేపథ్యంలో చంద్రబాబు మీడియా సమావేశం
ఏకపక్షంగా అణగదొక్కాలనుకుంటే అది మీ వల్ల కాదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీకి సవాల్ విసిరారు. పులివెందుల తరహా పంచాయతీలు ఇక్కడ చేద్దామంటే కుదరదని హెచ్చరించారు. ఆస్తుల పంపకంలో మాటసాయం చేస్తే కూడా కోడెలపై క్రిమినల్ కేసు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పేరు చెప్పి ఉద్యోగాలు కల్పిస్తానని డబ్బు వసూలు చేసిన నాగరాజు వంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే కూడా కోడెలపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

అడిగేవారు లేరని ఇష్టానుసారం వ్యవహరిస్తారా? నన్నపనేనిపై అనవసరంగా కేసు పెట్టారు, ఏమిటీ వేధింపులు? ఎలాంటి ఆధారాలు లేకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు... కోడెలలా అందరూ ఆత్మహత్య చేసుకోవాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 'నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ భయపడలేదు, ఆఖరికి ప్రాణాలు పోతాయని కూడా భయపడలేదు, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు' అంటూ తీవ్రస్వరంతో వ్యాఖ్యలు చేశారు.
Chandrababu
YSRCP
Telugudesam
Jagan

More Telugu News