Chandrababu: మీరు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు... జగన్ అసలు మాట్లాడడంలేదు: చంద్రబాబు విసుర్లు

  • చంద్రబాబు మీడియా సమావేశం
  • వైసీపీ నేతలపై మండిపాటు
  • జగన్ మౌనంగా ఉండడం సరికాదంటూ హితవు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కోడెల మృతి, తదనంతర పర్యవసానాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు ఉదయం నుంచి ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మీరు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు, సీఎం జగన్ మాత్రం మౌనం వీడడంలేదు.. ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వివరణ ఇవ్వకపోతే మిమ్మల్ని దోషులుగా నిలబెట్టాల్సిన బాధ్యత మాపై ఉంంది. కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయాలనుకుంటున్నారేమో, మీ కేసులేమీ పనిచేయవు. దేనికైనా ఓ హద్దుంటుంది. ఆ హద్దు దాటిన తర్వాత ఏదైనా చేయగలం అనుకుంటే ఖబడ్దార్, జాగ్రత్తగా ఉండండి. నేనడిగే ప్రశ్నకు నాక్కాదు, ప్రజలకు సమాధానం చెప్పాలి" అంటూ స్పందించారు.
Chandrababu
Jagan
Telugudesam
YSRCP
Kodela

More Telugu News