Narendra Modi: మీ కలలు నెరవేరేలా సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను: మోదీకి చంద్రబాబు విషెస్

  • నేడు ప్రధాని మోదీ పుట్టినరోజు
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
  • సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలంటూ ట్వీట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. నరేంద్ర మోదీ గారూ, వెరీ హ్యాపీ బర్త్ డే. 'దేశ భవిష్యత్తు కోసం మీరు కంటున్న కలలు సాకారం చేసుకునేందుకు ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ప్రధానికి విషెస్ చెప్పారు. 'ఎల్లప్పుడూ మీరు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండేలా ఆ దేవుడి కృప మీపై ఉండాలని ప్రార్థిస్తున్నాను' అని ట్విట్టర్ లో సందేశం ఉంచారు.
Narendra Modi
Chandrababu
Nara Lokesh

More Telugu News